
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa The Rule). ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల చేశారు మేకర్స్.
గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్ లో అమ్మవారి అవతారంలో మాస్ జాతర చేశారు అల్లు అర్జున్. టీజర్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా ఐపోతున్నారు. ఒక్కో షాటు ఒక్కో విజువల్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇక ఆ విజువల్స్ కి రాక్ స్టార్ దేవి అందించిన మ్యూజిక్ ఆడియన్స్ ను పూనకాలు తెప్పిస్తోంది.
68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే పుష్పరాజ్ అన్ని రికార్డులను బద్దలు కొడుతోన్నాడు.ప్రస్తుతం యూట్యూబ్ లో ??+ లైక్స్ అండ్ 12 గంటలలోనే ???+ రియల్ టైం వ్యూస్ తో మోత మోగిస్తున్నాడు.ఈ కౌంట్ మినెట్ టూ మినెట్ చేంజ్ అవుతూ వస్తోంది.
చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తూ..టీజర్ అరాచరంగా ఉందని, ఇది అల్లు అర్జున్ మాస్ జాతర అని, ఇది పుష్పగాడి ఆగమనం అంటూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.ఇక సోషల్ మీడియాలో ఈ టీజర్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ తో రికార్డ్ లెవల్లో వ్యూస్ వస్తున్నాయి.
#PushpaRaj is shattering all the records ??#Pushpa2TheRuleTeaser ???????? #? on YouTube with ??+ ???????
— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2024
A MASSive ???+ ????-???? ????? in 12 HOURS ❤️?
▶️ https://t.co/A2n4hu3oO4#HappyBirthdayAlluArjun
Grand release worldwide on 15th AUG… pic.twitter.com/18ouE6zEiD
టీజర్ తోనే పిచ్చెక్కిస్తుంటే..ఇక ట్రైలర్ కట్ తో హై ఓల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ నే దింపేలా ఉన్నాడు. పుష్ప కి తోడుగా లెక్కల మాస్టర్ సుక్కు భాయ్, మ్యూజిక్ మాస్టర్ దేవి శ్రీ ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆగష్టు 15న బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్‌తో పాటు వెయ్యి కోట్లు ఖాతాలో పడినట్టే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.